Thursday, October 23, 2008

ఆ ముగ్గురు.......

ఆ నలుగురు సినిమాలా ఆ ముగ్గురు యెవరనుకుంటునారా.. నా బ్లాగ్ మొదలు పెట్టడానికి కారణమైన ముగ్గురు..వీళ్ళ ప్రేరణ తోనే నేను ఈ బ్లాగ్ రాసింది...నా కాలేజ్ గ్రీకువీరుడు కేవి,మా అమ్మ ,సీనుగాడు ఉరఫ్ శ్రీనివాస్...కేవి తెలుగు వాడే కానీ పుట్టి పెరిగిందంతా వేరే రాష్ట్రంలో..తను కాలేజ్ లో చేరినప్పుడు తెలుగు అంత సరిగ్గా మాట్లాడటం రాదు కానీ ఇప్పుడు ఇంటెర్నెట్ లో తెలుగు భాషాభి వృద్ధికి పాటుపడేవాళ్ళలో తను మొదట ఉంటాడు...కాలేజ్ లో తను తెలుగు నేర్చుకోవటానికి పడే తపన చూసి ముచ్చట వేసేది..తన గురుంచి ఎప్పుడు మా అమ్మకి చెప్పేదానిని...దానితో మా అమ్మ కి కేవి మీద మంచి అభిప్రాయము ...ఈ సంవత్సరం తెలుగు బ్లాగేర్స్ గురించి ఈనాడు సన్‌డే ఎడిషన్ బుక్ లో కేవి గురించి మా అమ్మ చదివి నన్ను అన్న మాటలు ఇప్పటికీ మర్చిపోలేను(అమ్మ ఏమ్మనాదో ఇంకొక బ్లాగ్‌లో చెప్తాను) అప్పుడు చాలా ఫీల్ అయ్యాను...చటుక్కున ఆవేశం వచేసింది...కానీ ఎంత తొందరగా ఆవేశం వచేసిందో అంతే తొందర్‌గా చల్లారిపోయింది...మళ్లీ ఈ శ్రీనివాస్ పసునురి వల్ల బ్లాగ్ రాయాలనిపించింది..తను నా బెంగళూరు ఆఫీస్ లో దొస్త్..వాడు గుర్గాంవ్ బ్రాంచ్ కి వెళ్ళిపోయేటప్పటి నుంచి స్నేహితులందరికి పెద్ద పెద్దమెయిల్స్ తెలుగులో.పంపించేవాడు తర్వాత కంపెనీ APగ్రూప్ కి కూడా పంపించేవాడు..తెలుగులో ఇంత బాగా ఎలా రాస్తునాడో అని అనుకునెదానిని..అకస్మాత్తుగా ఒక రోజు తానౌ బ్లాగ్ రాస్తునని అన్నాడు...అప్పటినుంచి తన బ్లాగ్ చదివేదానిని..అలా తను కూడా నాకు ప్రేరణ...అప్పుడప్పుడు గోదావరికి సంబంధించిన బ్లాగ్స్ చదివేదానిని...కంపెనీ మారిన తర్వాత పనే లేదు...ఇంకా బెంచ్‌లోనే.. ఇప్పుడు ఖాళీ సమయం దొరికింది కదా అని నా బ్లాగ్ ప్రహసనం మొదలు పెట్టాను...ఇప్పుడు మా అమ్మ చాలా హ్యాపీస్........

3 comments:

Anonymous said...

తుంటరి కోతి,
నన్ను ఇలా బ్లాగులోకి ఈడ్చటం ఏమైనా బాగుందా???

ఇట్లు,
సీనుగాడు ఉరఫ్ శ్రీనివాస్

చైతన్య.ఎస్ said...

అయితే మరి ఆ ముగ్గరికి ముందు థాంక్స్ చెప్పుకోవాలి.. ఇంతకీ కె.వి ఏవరబ్బా ...

అల్లరి తుంటరి సిరి.......... said...

:) :) :)

 
Free Counter
FreeCounter