Thursday, October 23, 2008
ఆ ముగ్గురు.......
ఆ నలుగురు సినిమాలా ఆ ముగ్గురు యెవరనుకుంటునారా.. నా బ్లాగ్ మొదలు పెట్టడానికి కారణమైన ముగ్గురు..వీళ్ళ ప్రేరణ తోనే నేను ఈ బ్లాగ్ రాసింది...నా కాలేజ్ గ్రీకువీరుడు కేవి,మా అమ్మ ,సీనుగాడు ఉరఫ్ శ్రీనివాస్...కేవి తెలుగు వాడే కానీ పుట్టి పెరిగిందంతా వేరే రాష్ట్రంలో..తను కాలేజ్ లో చేరినప్పుడు తెలుగు అంత సరిగ్గా మాట్లాడటం రాదు కానీ ఇప్పుడు ఇంటెర్నెట్ లో తెలుగు భాషాభి వృద్ధికి పాటుపడేవాళ్ళలో తను మొదట ఉంటాడు...కాలేజ్ లో తను తెలుగు నేర్చుకోవటానికి పడే తపన చూసి ముచ్చట వేసేది..తన గురుంచి ఎప్పుడు మా అమ్మకి చెప్పేదానిని...దానితో మా అమ్మ కి కేవి మీద మంచి అభిప్రాయము ...ఈ సంవత్సరం తెలుగు బ్లాగేర్స్ గురించి ఈనాడు సన్డే ఎడిషన్ బుక్ లో కేవి గురించి మా అమ్మ చదివి నన్ను అన్న మాటలు ఇప్పటికీ మర్చిపోలేను(అమ్మ ఏమ్మనాదో ఇంకొక బ్లాగ్‌లో చెప్తాను) అప్పుడు చాలా ఫీల్ అయ్యాను...చటుక్కున ఆవేశం వచేసింది...కానీ ఎంత తొందరగా ఆవేశం వచేసిందో అంతే తొందర్గా చల్లారిపోయింది...మళ్లీ ఈ శ్రీనివాస్ పసునురి వల్ల బ్లాగ్ రాయాలనిపించింది..తను నా బెంగళూరు ఆఫీస్ లో దొస్త్..వాడు గుర్గాంవ్ బ్రాంచ్ కి వెళ్ళిపోయేటప్పటి నుంచి స్నేహితులందరికి పెద్ద పెద్దమెయిల్స్ తెలుగులో.పంపించేవాడు తర్వాత కంపెనీ APగ్రూప్ కి కూడా పంపించేవాడు..తెలుగులో ఇంత బాగా ఎలా రాస్తునాడో అని అనుకునెదానిని..అకస్మాత్తుగా ఒక రోజు తానౌ బ్లాగ్ రాస్తునని అన్నాడు...అప్పటినుంచి తన బ్లాగ్ చదివేదానిని..అలా తను కూడా నాకు ప్రేరణ...అప్పుడప్పుడు గోదావరికి సంబంధించిన బ్లాగ్స్ చదివేదానిని...కంపెనీ మారిన తర్వాత పనే లేదు...ఇంకా బెంచ్‌లోనే.. ఇప్పుడు ఖాళీ సమయం దొరికింది కదా అని నా బ్లాగ్ ప్రహసనం మొదలు పెట్టాను...ఇప్పుడు మా అమ్మ చాలా హ్యాపీస్........
Wednesday, October 22, 2008
మా బడి......
మా బడికి నేను చదివే రోజులలో మంచి పేరు..ఇప్పుడు రెసిడెన్షియల్ స్కూల్స్ ధాటికీ తట్టుకోలేక చతికిల పడింది : ( ఇప్పుడు మా బడిలో విద్యార్థులు ఎవరు లేరు..అప్పటిలో ఇంగ్లీష్ మీడియమ్ స్కూల్స్ లో పెద్ద పేరైన మా బడి ఇప్పుడు దుంపల బడి అనే టైప్ లో తయారైంది...ఇప్పుడు ఎంత ఘోరమైన పరిస్థితంటే మా బడిని నాఆటోగ్రాఫ్ సినిమాలో చూడొచ్చు.....ఆ స్కూల్ లో నాలుగో తరగతికి కూడా ప్రవేశ పరీక్ష...ఆ పరీక్షలో పాసైయినప్పుడు ఎంత గొప్పగా ఫీల్ అయ్యానో...స్కూల్ ఐతే సూపర్...కానీ మా క్లాస్ లోనే అంత చిన్న వసయులోనే ముదురులు+ రాజకీయాలు..అబ్బాయీ -అమ్మాయీమాటలాడుకుంటే వాళ్లిద్దరికి లింకులు..నేను అదేమీ పట్టించుకోకుండా అందరితో మాట్లాడేడానిని..దానికి తోడు నాకుపెద్ద కళ్ళజోడు..అందువల్ల నా జోలికి ఎవరు వచ్చేవారు కాదు. దానికి తోడు మా తరగతిలో ముగ్గురు సిరి'లు..ఒక సిరి మా క్లాస్ టాపర్..ఏక్ నిరంజన్ టైప్ లో ఉండేది..ఎవరితో మాట్లేడి కాదు ఒక్క సుహాస్ తో తప్ప ఎంతైనా గ్రీకు వీరుడు కదా :) మా ఇద్దరి పేర్లు ఒక్కటే అయ్యేటప్పటికి స్నేహంగానే ఉండేది ..కానీ పరీక్షలు అయ్యేటప్పటికి అంతా తారుమారు అయ్యింది..నేను మొదటి ప్లేస్ తను రెండో..ఆ విషయం జీర్ణిచుకోలేక ఆ అమ్మాయి ఎంత ఏడిచిందో...ఆ అమ్మాయి ఏడుపు చూసి నేను ఎంత బాధ పడ్డానో అనవసరముగా ఎక్కువ చదివేశానని..కానీ మిగతా క్లాస్మేట్స్ వచ్చి మంచి పని చేశావ్ ఆ పిల్లకీ ఎంత పొగరనుకున్నావ్..తను ఎవరితో మాట్లాడదు+ తను క్లాస్ లీడర్ కూడా కావటంతో మన క్లాస్ టీచర్ తో మాకు తిట్ల దండకం....అని మొర పెట్టుకునేటప్పటికి కొంచెం శాంతించి ఇప్పటివరకు అనవసరంగా ఫీల్ అయ్యానని నన్ను నేనే తిట్టుకునాను.. దాని తర్వాత క్లాస్ లో మూడు గ్రూపులు తయారయ్యాయి.ఒకటి సిరి గ్రూప్ ఇంకొకటి శాలు గ్రూప్ ఇంకొకటి నా గ్రూప్..నా గ్రూప్ అంటే క్లాస్ మొత్తం శాలు&కో , సిరి తప్ప..ఇంతకీ ఈ శాలు గురించి చెప్పలేదు కదా.తను మా తరగతిలో ఒక గొప్ప ఫిగర్(నేను అలా అనకూడదేమో)..పాపం ఆ అమ్మాయీ అనుకునేది తను పెద్ద ఫిగర్ అని..దానికి తోడు మా క్లాస్ అబ్బాయీలు తప్ప మిగత క్లాస్ అబ్బాయీలు ఆ అమ్మాయికి సైటు కొట్తేవారు అంత చిన్న వయస్సులోనే...అందువల్ల అందరి కంటే తను టిపికల్ అనుకునేది..శాలుకి ఎందుకంత టెక్కో అర్థం అయ్యేది కాదు మా క్లాస్ వాళ్ళకి..ఒక్క విషయం ఇప్పటికీ అర్థం కాలేదు తనకి నా మీద కొపమో..
Thursday, October 16, 2008
నా మొదటి ..........
ఏమిటో చిన్నప్పుడు జాకీ చాన్ అంటే ఎంతో పిచ్చి అది కూడా నాలుగో క్లాస్‌లో....తాను చేసే ఫైట్స్ కామెడీ చూసి చూసి పెద్ద వీరాభిమానిని అయిపోయాను..నా జాకీ చాన్ పిచ్చికి తోడుగా నా ఫ్రెండ్ హాస్...వాడు కూడా ఎప్పుడు చూసిన వాటి గురుంచే మాట్లాడేవాడు...ఆ పిచ్చి ఎంత ముదిరందంటే హాస్ కి కూడా జాకీ చాన్ మేనరిజంస్ వచేశాయి...హాస్ ఎప్పుడు డ్రెసింగ్ స్టైల్ చేతలు అన్న్నీ జాకీ చాన్ లాగా చేసేవాడు.ఇంకా దాని తోడు నా మైండ్ దిమ్మ తిరిగి హాస్ అంటే ఒక ఇది..........దూరపు కొండలు నునుపు అన్న టైప్ లో హాస్ అంటే ఎందుకు ఇష్టం అంటే హాస్ తెలుగు వాడు కాదు..సో ఇంకా ఇష్టమన్నమాట.. .. ఎప్పుడు చూసిన హాస్ హాస్ అని కలవరింతలు..గాలిలో తేలినట్టుందే అనే సాంగ్ లాగా.....తనే నా మొదటి........... క్రష్ అన్నమాట..
నేనొక్కదానినే చాలా లక్కీ గర్ల్ అనే భ్రమ లో ఉండెదానిని చాలా రోజులు...తర్వాత తెలిసింది నేను క్వ్యూ లో లాస్ట్ అని...విషయం ఏమిటంటే నేను ఆ బడిలో జాయిన్ అయ్యినదేమో నాలుగో తరగతిలో..హాస్ జాయిన్ అయ్యింది మూడో తరగతిలో..అప్పటినుంచే అమ్మాయిలుకు వాడు గ్రీకు వీరుడు....
నేనొక్కదానినే చాలా లక్కీ గర్ల్ అనే భ్రమ లో ఉండెదానిని చాలా రోజులు...తర్వాత తెలిసింది నేను క్వ్యూ లో లాస్ట్ అని...విషయం ఏమిటంటే నేను ఆ బడిలో జాయిన్ అయ్యినదేమో నాలుగో తరగతిలో..హాస్ జాయిన్ అయ్యింది మూడో తరగతిలో..అప్పటినుంచే అమ్మాయిలుకు వాడు గ్రీకు వీరుడు....
Tuesday, October 14, 2008
నా మొదటి బ్లాగ్
ఈనాడులో బ్లాగర్స్ గురుంచి చదివి తెలుగులో బ్లాగ్ రాయటం చాలా సులువు అనుకున్నాను..కానీ తెలుగు పదాలు మాత్రమే వాడి రాయటం అంటే ఎంత కష్టమో ఇప్పుడు తెలుస్తుంది....లోతు ఎంతుందో దిగే దాకా తెలియదంటారు కదా అలా ఉంది నా పరిస్థితీ....
Subscribe to:
Comments (Atom)
