Wednesday, October 22, 2008

మా బడి......

మా బడికి నేను చదివే రోజులలో మంచి పేరు..ఇప్పుడు రెసిడెన్షియల్ స్కూల్స్ ధాటికీ తట్టుకోలేక చతికిల పడింది : ( ఇప్పుడు మా బడిలో విద్యార్థులు ఎవరు లేరు..అప్పటిలో ఇంగ్లీష్ మీడియమ్ స్కూల్స్ లో పెద్ద పేరైన మా బడి ఇప్పుడు దుంపల బడి అనే టైప్ లో తయారైంది...ఇప్పుడు ఎంత ఘోరమైన పరిస్థితంటే మా బడిని నాఆటోగ్రాఫ్ సినిమాలో చూడొచ్చు.....ఆ స్కూల్ లో నాలుగో తరగతికి కూడా ప్రవేశ పరీక్ష...ఆ పరీక్షలో పాసైయినప్పుడు ఎంత గొప్పగా ఫీల్ అయ్యానో...స్కూల్ ఐతే సూపర్...కానీ మా క్లాస్ లోనే అంత చిన్న వసయులోనే ముదురులు+ రాజకీయాలు..అబ్బాయీ -అమ్మాయీమాటలాడుకుంటే వాళ్లిద్దరికి లింకులు..నేను అదేమీ పట్టించుకోకుండా అందరితో మాట్లాడేడానిని..దానికి తోడు నాకుపెద్ద కళ్ళజోడు..అందువల్ల నా జోలికి ఎవరు వచ్చేవారు కాదు. దానికి తోడు మా తరగతిలో ముగ్గురు సిరి'లు..ఒక సిరి మా క్లాస్ టాపర్..ఏక్ నిరంజన్ టైప్ లో ఉండేది..ఎవరితో మాట్లేడి కాదు ఒక్క సుహాస్ తో తప్ప ఎంతైనా గ్రీకు వీరుడు కదా :) మా ఇద్దరి పేర్లు ఒక్కటే అయ్యేటప్పటికి స్నేహంగానే ఉండేది ..కానీ పరీక్షలు అయ్యేటప్పటికి అంతా తారుమారు అయ్యింది..నేను మొదటి ప్లేస్ తను రెండో..ఆ విషయం జీర్ణిచుకోలేక ఆ అమ్మాయి ఎంత ఏడిచిందో...ఆ అమ్మాయి ఏడుపు చూసి నేను ఎంత బాధ పడ్డానో అనవసరముగా ఎక్కువ చదివేశానని..కానీ మిగతా క్లాస్‌మేట్స్ వచ్చి మంచి పని చేశావ్ ఆ పిల్లకీ ఎంత పొగరనుకున్నావ్..తను ఎవరితో మాట్లాడదు+ తను క్లాస్ లీడర్ కూడా కావటంతో మన క్లాస్ టీచర్ తో మాకు తిట్ల దండకం....అని మొర పెట్టుకునేటప్పటికి కొంచెం శాంతించి ఇప్పటివరకు అనవసరంగా ఫీల్ అయ్యానని నన్ను నేనే తిట్టుకునాను.. దాని తర్వాత క్లాస్ లో మూడు గ్రూపులు తయారయ్యాయి.ఒకటి సిరి గ్రూప్ ఇంకొకటి శాలు గ్రూప్ ఇంకొకటి నా గ్రూప్..నా గ్రూప్ అంటే క్లాస్ మొత్తం శాలు&కో , సిరి తప్ప..ఇంతకీ ఈ శాలు గురించి చెప్పలేదు కదా.తను మా తరగతిలో ఒక గొప్ప ఫిగర్(నేను అలా అనకూడదేమో)..పాపం ఆ అమ్మాయీ అనుకునేది తను పెద్ద ఫిగర్ అని..దానికి తోడు మా క్లాస్ అబ్బాయీలు తప్ప మిగత క్లాస్ అబ్బాయీలు ఆ అమ్మాయికి సైటు కొట్తేవారు అంత చిన్న వయస్సులోనే...అందువల్ల అందరి కంటే తను టిపికల్ అనుకునేది..శాలుకి ఎందుకంత టెక్కో అర్థం అయ్యేది కాదు మా క్లాస్ వాళ్ళకి..ఒక్క విషయం ఇప్పటికీ అర్థం కాలేదు తనకి నా మీద కొపమో..

10 comments:

కొత్త పాళీ said...

వార్నాయనో .. నాలుగో క్లాసులోనే ఇంత బాగోతం? నిజంగా ముదుర్లే :)
బాపట్లలో ఏం చదివారు?
కొన్ని బాపట్ల జ్ఞాపకాలు మీకోసం:
http://kottapali.blogspot.com/2007/09/blog-post_25.html
http://kottapali.blogspot.com/2007/09/blog-post_26.html

చైతన్య.ఎస్ said...

మేము 7 క్లాస్ కి వచ్చాక కాని లింక్ లు పెట్టి మాట్లాడే వాళ్ళం కాదు ....కాని మీరు 4 కే లింక్ లు పెట్టేసేవారా హమ్మో ! ఇంతకి మనలో మన మాట శాలు ఎక్కడున్నారు ఇప్పుడు ? :)

MURALI said...

బాగున్నాయి మీ ఙ్ఞాపకాలు. ఇంతకి శాలు సంగతేంటి? ఏమి చేస్తుందో చెప్పారు కాదు.

Anonymous said...

హహ బావుంది. :)

అల్లరి తుంటరి సిరి.......... said...

ఇంటర్ లో ఒకసారి కలిసాను..తర్వాత కాలేజ్ సెలవులలో మా వూరు వెళ్ళినప్పుడు శాలు కి పెళ్లి అయ్యిన తర్వాత తమిళ నాడు వెళ్ళి పోయింది అని తెలిసింది...

అల్లరి తుంటరి సిరి.......... said...

కొత్త పాళీ బాగునాయీ మీ జ్ఞాపకాలు...బాపట్లని ఒకసారి నా కళ్ల ముందు ఉంచారుగా...నేను కూడా త్వరలో రాస్తాను బాపట్ల గురుంచి..ఇంకా నా స్కూల్ విషయాలే చాలా ఉన్నయీ..ఐతే మీరు ఏ సబ్జెక్ట్ చెప్పేవారు....నేను చదివింది ఆ కళాశాలలోనే

మీనాక్షి said...

hi siri asaleppudochaaru..ee blog lokam loki..
ento ila meerochaarani naku ee roje telisindi..
chaalaa baaunnayi mee kaburlu..

కొత్త పాళీ said...

నేను బాపట్లలో పాఠం చెప్పింది ఒకే ఒక్క విద్యా సంవత్సరం. బవుశా మీరప్పటికి మీ హాసుగాడికి లైన్లేసుకుంటూ ఉండి ఉంటారు :)
నేను మెకానికల్ ఫైనల్ ఇయర్ వాళ్ళకి పవర్ ప్లాంట్ టెక్నాలజీ, అనేక బ్రాంచిల ఫస్టియర్ వాళ్ళకి ఇంజనీరింగ్ డ్రాయింగ్ పాఠం చెప్పాను.

జ్యోతి said...

అయ్యబాబోయ్. అంత చిన్న క్లాసులలో ఫిగర్లు, గ్రూపులు, లైన్లేసుకోవడాలు.. ఈ కథలన్నీ జరిగింది ఎప్పుడు. ఈ మధ్యా. పాతవా?

అల్లరి తుంటరి సిరి.......... said...

ఆది జరిగి 18 సంవత్సరాలు అయ్యింది...

 
Free Counter
FreeCounter