Thursday, October 16, 2008

నా మొదటి ..........

ఏమిటో చిన్నప్పుడు జాకీ చాన్ అంటే ఎంతో పిచ్చి అది కూడా నాలుగో క్లాస్‌లో....తాను చేసే ఫైట్స్ కామెడీ చూసి చూసి పెద్ద వీరాభిమానిని అయిపోయాను..నా జాకీ చాన్ పిచ్చికి తోడుగా నా ఫ్రెండ్ హాస్...వాడు కూడా ఎప్పుడు చూసిన వాటి గురుంచే మాట్లాడేవాడు...ఆ పిచ్చి ఎంత ముదిరందంటే హాస్ కి కూడా జాకీ చాన్ మేనరిజంస్ వచేశాయి...హాస్ ఎప్పుడు డ్రెసింగ్ స్టైల్ చేతలు అన్న్నీ జాకీ చాన్ లాగా చేసేవాడు.ఇంకా దాని తోడు నా మైండ్ దిమ్మ తిరిగి హాస్ అంటే ఒక ఇది..........దూరపు కొండలు నునుపు అన్న టైప్ లో హాస్ అంటే ఎందుకు ఇష్టం అంటే హాస్ తెలుగు వాడు కాదు..సో ఇంకా ఇష్టమన్నమాట.. .. ఎప్పుడు చూసిన హాస్ హాస్ అని కలవరింతలు..గాలిలో తేలినట్టుందే అనే సాంగ్ లాగా.....తనే నా మొదటి........... క్రష్ అన్నమాట..

నేనొక్కదానినే చాలా లక్కీ గర్ల్ అనే భ్రమ లో ఉండెదానిని చాలా రోజులు...తర్వాత తెలిసింది నేను క్వ్యూ లో లాస్ట్ అని...విషయం ఏమిటంటే నేను ఆ బడిలో జాయిన్ అయ్యినదేమో నాలుగో తరగతిలో..హాస్ జాయిన్ అయ్యింది మూడో తరగతిలో..అప్పటినుంచే అమ్మాయిలుకు వాడు గ్రీకు వీరుడు....

2 comments:

yaji said...

మీకు మీరే కోతి అని అనుకోడం సబబు గా లేదు.

yaji said...

నా ఉద్దేశ్యం ఇంకోళ్ళు అనచ్చు అని కాదండోయ్

 
Free Counter
FreeCounter